మోడి రాకతో రేపు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
మోడి రాకతో రేపు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ ఎస్ బి) 20వ వార్షికోత్సవంలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఐఎస్‌బీ పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అందుకు గాను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు సమయంలో గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో వైపు, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ :
గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్, బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి క్రాస్ రోడ్, హెచ్సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, మాదాపూర్ పిఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్లో భారీ వాహనాల రాకపోకలను అనుమతించమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
1. అమెరికాలో కాల్పులు, 18 మంది విద్యార్ధులు, ముగ్గురు టీచర్లు మృతి
2. ఫ్లాష్.. ఫ్లాష్.. మిర్యాలగూడలో డీసీఎం ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి









