Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫిర్యాదులన్నింటిని రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిబి. చంద్రశేఖర్ ఆదేశించారు.

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ

నల్లగొండ, మనసాక్షి :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫిర్యాదులన్నింటిని రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిబి. చంద్రశేఖర్ ఆదేశించారు.

శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల జిల్లా కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదులు, టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు వచ్చిన ఫిర్యాదులు, అలాగే వాట్సాప్ నంబర్ 6305951279 కు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్ లో తనిఖీ చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్ కు వచ్చిన అన్ని రకాల ఫోన్ కాల్స్ ఫిర్యాదులన్నింటిని ప్రత్యేకంగా రిజిస్టర్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదులు ,వాట్సాప్ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయాలని, వెంటనే సంబంధిత నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ లో ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ,ముఖ్యంగా నోడల్ అధికారులు వారి ఫోన్ నెంబర్లు, మున్సిపాలిటీ వారిగా సమాచారం , ఇతర సమాచారం అంతా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బందికి ఫిర్యాదుల నమోదు పై పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏదైనా ఫిర్యాదులను చేయదలిస్తే జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 18004251442 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

MOST READ : 

  1. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

  2. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో BRS జోష్.. వార్డుల అభ్యర్థుల జాబితా విడుదల..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!

  4. KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!

మరిన్ని వార్తలు