TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో ఎవరికి వారే యమునా తీరు.. అంతా చైర్మన్ అభ్యర్థులే.. బి ఫాం కోసం ఇక యుద్ధమేనా..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య పోటీ కాదు. ఇక్కడ మాత్రం విచిత్ర రాజకీయం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఎవరికి వారే యమునా తీరు.. అంతా చైర్మన్ అభ్యర్థులే.. బి ఫాం కోసం ఇక యుద్ధమేనా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య పోటీ కాదు. ఇక్కడ మాత్రం విచిత్ర రాజకీయం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన విషయం తెలిసిందే.

కాగా చైర్పర్సన్ పీఠం ఎక్కేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే అనేకమంది కన్నేశారు. ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా రాజకీయాలు మారాయి. మున్సిపల్ చైర్మన్ పీఠం బరిలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి కూడా తెరపైకి రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

  • మున్సిపల్ చైర్పర్సన్ బరిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్న నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి నూకల కవితను దించేందుకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించి 17 వ వార్డు నుంచి నామినేషన్ వేశారు.
  • చిలుకూరి బాలకృష్ణ ఆయన సతీమణి చిలుకూరి సుద 31 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో దించి చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు.
  • అదే విధంగా శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి 2వ వార్డు నుంచి పోటీ చేసి చైర్మన్ పీఠం దక్కించుకునే ప్రయత్నంలో నామినేషన్ వేశారు.
  • వీరితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్, యువజన కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి వెంకటేష్ మాతృమూర్తిని రంగంలోకి దింపి నామినేషన్లు దాఖలు చేశారు.
  • వీరితోపాటు మరికొంత మంది కూడా చైర్మన్ సీటు దక్కించుకోవాలని వారి సతీమణులను కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీలో దించారు.

పోటాపోటీ :

కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడలో గ్రూపుల లొల్లి, వర్గ విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఒకే వార్డుకు ఇద్దరు ముగ్గురు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. దాంతో బీఫాముల కోసం కుస్తీ తప్పని పరిస్థితి నెలకొన్నది.

40 వ వార్డు జనరల్ స్థానంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ నామినేషన్ వేయగా అదే వార్డు నుంచి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిన్న కుమారుడు ఈశ్వర్ గణేష్, మిట్టపల్లి వెంకటేష్ మాతృమూర్తి శ్రీదేవి నామినేషన్ వేశారు.

39 వ వార్డు నుంచి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి నామినేషన్ దాఖలు చేయగా ఎమ్మెల్యే అనుచరిడిని అని, తాము చైర్పర్సన్ రేసులో ఉన్నామని చెప్పుకుంటూ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఎవరికి ఆ పార్టీ బీఫామ్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

MOST READ 

  1. Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!

  2. Suryapet : ఆరోగ్య ఉప కేంద్రానికి ఇంటి యజమాని తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించని వైనం..!

  3. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

  4. Medaram : జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ..!

మరిన్ని వార్తలు