జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

Miryalaguda : మున్సిపల్ కమిషనర్ ఆదేశం.. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంచాలి..!

బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులను పంచాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు.

Miryalaguda : మున్సిపల్ కమిషనర్ ఆదేశం.. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంచాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులను పంచాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం రెండవ సాధారణ ఎన్నికలు -2026 కు సంబంధించి సోమవారం మిర్యాలగూడ మున్సిపాలిటీ సమావేశం మందిరంలో బూత్ లెవెల్ ఆఫీసర్( బీ ఎల్ ఓ) ల సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఇంటింటికి తిరిగి ఈ ఓటర్స్ స్లిప్పులను పంచాలన్నారు. అవి కూడా ఆఫీస్ అవర్స్ లో సాయంత్రం ఐదు గంటల వరకే పంచాలని తెలియజేశారు.

ఈనెల 7వ తారీఖు వరకు మొత్తము ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని అన్నారు. ఫీల్డ్ మీదికి పోయినప్పుడు మెప్మా ఆర్ పి లు, వార్డ్ ఆఫీసర్ యొక్క సహాయము తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఏ రాజకీయ నాయకునికి గాని ఎవరికి గాని ఓటర్ స్లిప్పులను పంచవద్దని తెలియజేశారు.

వార్డులో ఎవరైనా చనిపోయినట్లు ఉంటే అట్టి డాటా ను తీసుకొచ్చి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లకు ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ బాలు, కోటయ్య మెప్మా టిఎంసి, నోడల్ ఆఫీసర్ బక్కయ్య సి ఓ లు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు ,సతీషు ఝాన్సీ ,జానీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు