Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

భూమి రికార్డుల పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (ఆర్‌ఐ) మహమ్మద్ అబ్దుల్ హకీమ్ సోమవారం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

NLG : రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

గుర్రంపోడ్,, మన సాక్షి :

భూమి రికార్డుల పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (ఆర్‌ఐ) మహమ్మద్ అబ్దుల్ హకీమ్ సోమవారం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఉట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ గోరోమియా కు సంబంధించిన సర్వే నెం. 225/6లో గల 1.15 ఎకరాల భూమి వివరాలు ఆన్‌లైన్ 1-బి రిజిస్టర్ (ఆర్ ఓ ఆర్ ) నుండి తొలగించబడ్డాయి. వీటిని తిరిగి పునరుద్ధరించేందుకు అవసరమైన ఫైల్‌ను ప్రాసెస్ చేసి తహసీల్దార్‌కు పంపేందుకు ఆర్‌ఐ హకీమ్ రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు సోమవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ. 20,000 నగదును ఆర్‌ఐకి అందజేస్తుండగా, అప్పటికే మాటువేసిన ఏసీబీ బృందం ఆయనను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతనికి కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

అధికారిక విధులను నిర్వర్తించడానికి లంచం డిమాండ్ చేసినందుకు గానూ హకీమ్‌పై కేసు నమోదు చేసినట్టు రేంజ్ అధికారి జగదీష్ తెలిపారు. నిందితుడిని విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలేది లేదని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు