Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
Narayanpet : ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా నారాయణపేట పట్టణంలోని ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టినట్లు సిఐ శివ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు లు తెలిపారు.

Narayanpet : ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా నారాయణపేట పట్టణంలోని ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టినట్లు సిఐ శివ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు లు తెలిపారు.
మంగళవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా
మహబూబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షఫీ అనే వ్యక్తి యాదగిరి నుండి మహబూబ్‌నగర్‌కు రూ.1,17,000 నగదును తీసుకెళ్తుండగా ఎర్ర గుట్ట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ నిర్వహించగా, ఆ నగదుకు సంబంధించి ఎటువంటి సరైన బిల్లులు , ఆధారాలు చూపించలేకపోయాడని తెలిపారు.
దీంతో ఎన్నికల నిబంధనల మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం గ్రీవియన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అనుమానాస్పద నగదు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని సీఐ సూచించారు.