Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

నలగొండ, మన సాక్షి :

గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి మండల , జిల్లా , రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

గ్రామాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వేదికలేమి కారణంగా క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారని, సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఆ ప్రతిభకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జిల్లా పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చు.

ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా యువతలో జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందుతాయని కలెక్టర్ వివరించారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి మరింత ఉన్నత స్థాయికి చేరాలని. నల్గొండ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మెడల్ తీసుకురావాలని ఆకాంక్షించారు.

వివిధ కోచ్ లు సెక్రటరీలతో మాట్లాడిన కలెక్టర్
విద్యార్థులకు మెరుగైన క్రీడశిక్షణ కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. సీఎం క్రీడా కప్ పోటీలలో భాగంగా హాకీ ,బేస్ బాల్, తైక్వాండో, సైకిలింగ్ ,క్యారం, షూటింగ్ ,సీలింగ్, రోయింగ్, సెన్సింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ , నల్గొండ తహసిల్దార్ పరుశురాం, క్రీడల కోచ్ లు, క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

MOST READ 

  1. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  2. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 విజయం..!

  3. MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక.. మాజీ చైర్మన్ భార్గవ్ కీలక కామెంట్..!

  4. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. ఎవరికి ఎన్ని సీట్లు..!

మరిన్ని వార్తలు