Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

BREAKING : కత్తితో పలుమార్లు దాడి చేసి భర్తను చంపిన భార్య..!

కత్తితో పలుమార్లు దాడి చేసి కట్టుకున్న భార్య భర్తను హత్య చేసిన ఘటన మంగళవారం రోజు మందమరి శాంతినగర్ లో చోటు చేసుకుంది.

BREAKING : కత్తితో పలుమార్లు దాడి చేసి భర్తను చంపిన భార్య..!

మందమర్రి రూరల్, మానసాక్షి :

కత్తితో పలుమార్లు దాడి చేసి కట్టుకున్న భార్య భర్తను హత్య చేసిన ఘటన మంగళవారం రోజు మందమరి శాంతినగర్ లో చోటు చేసుకుంది. మృతుడి తల్లి ఫైజియా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఎండి మోయినొద్దీన్ ( 42 )శాంతినగర్ అను అతను 10 సంవత్సరాల క్రితం చుక్కల అవంతిని మతాంతర వివాహం చేసుకున్నాడు.

వీరిద్దరి మధ్య తరచూ డబ్బుల విషయంలో చాలా రోజుల నుండి గొడవ జరుగుతుండగా మంగళవారం రోజున ఉదయం అందాజా ఐదు గంటల సమయంలో అవంతి (41) తన భర్త అయినా మోయిన్ ను చంపాలనే ఉద్దేశం తో కత్తి తీసుకొని మెడ పై పలుమార్లు దాడి చేయడంతో మోయిన్ కు తీవ్రంగా గాయమైంది.

రక్తసిక్తంతో పడి ఉన్న విషయం తెలుసుకున్న మందమరి ఎస్సై జి నరేష్ ఘటన స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న మోయిన్ ను 108 అంబులెన్స్ సహాయంతో మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కోన ఊపిరితో ఉన్న మోయిన్ మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చినా ఫిర్యాదుతో మందమర్రి ఎస్సై జీ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  2. BREAKING : హాలియాలో విషాదం.. లారీ ఢీకొని భార్యాభర్తలు మృతి..!

  3. Breaking News : టాప్ 5.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!

  4. TG News : తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే..!

మరిన్ని వార్తలు