Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం

Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని సల్కునూరు గ్రామంలో పగిళ్ల నాగమ్మ–దుర్గయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని స్థానిక సర్పంచ్ నారబోయిన సతీష్‌తో కలిసి ప్రారంభించారు.

Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి, (మన సాక్షి):

మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని సల్కునూరు గ్రామంలో పగిళ్ల నాగమ్మ–దుర్గయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని స్థానిక సర్పంచ్ నారబోయిన సతీష్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాల్లోనే నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల కలను సాకారం చేశామని చెప్పారు. త్వరలోనే పట్టణ ప్రాంతంలో కూడా 2,500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి అధిక స్థానాలు దక్కాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, మండల నాయకులు కృపయ్య, రావుల ఎల్లారెడ్డి, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దివ్య, ఆమనగల్ సర్పంచ్ పిల్లల సందీప్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు మరియు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు