District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..!
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వి. సి . హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ వి. సి . హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఫిబ్రవరి.25 బుధవారం నుంచి మార్చి 16. వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లాలో ఇంటర్ మొదటి ,రెండవ సంవత్సరం 8192 మంది విద్యార్థులకు 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అలాగే పదవ తరగతి పరీక్షలలో 8318 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చీటింగ్ వంటివి జరగకుండా చూడటానికి ముగ్గురు అధికారుల బృందంతో కూడిన ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ను ఏర్పాటు చేశామని అన్నారు.
ALSO READ : Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియుల్లో ఆందోళన..!
విద్యార్థులు సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా సమయానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు, పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు కేవలం హాల్టికట్ తప్ప ఎలాంటి వస్తువులను తీసుకు వెళ్లడానికి అనుమతి లేదని, తమ వస్తువులను భద్రపరచడానికి క్లోక్ రూమ్ సిద్ధం చేశామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బి.ఎస్.ఎన్ సెక్షన్ 163 ( సి ఆర్ పి సి 144) అమలు చేయాలని, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని అన్నారు.
పరీక్ష కేంద్రం వద్ద పరీక్ష పత్రాల తరలింపులో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు సౌకర్యవంతమైన బెంచి లను , లైటింగ్, వైద్య శిబిరం తదితర వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 నిమిషాలకే చేరుకోవాలని మధ్యాహ్నం 12 గంటల కు పరీక్ష పూర్తి అయిన తరువాతనే పరీక్షా కేంద్రాల నుంచి బయటికి వెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్.పి.డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, ఆర్.డి.ఓ.రామచందర్,డి ఐ ఈ ఓ సుదర్శన్, డీఈవో గోవిందరాజు, ఆర్టీసీ డి. యం లావణ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- Breaking : తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..!
- District Collector : ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు.. వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి కలెక్టర్ దరఖాస్తుల స్వీకరణ..!
- Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
- Rythu Bharosa : రైతులకు శుభవార్త.. ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!









