Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణవిద్య

శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలకు భూమి కేటాయింపు..!

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, ఉన్నత విద్యా విస్తరణకు దోహదపడే కీలక నిర్ణయాన్ని తెలంగాణ కాబినెట్ 36 ఎకరాల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకుకు కేటాయించింది.

శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలకు భూమి కేటాయింపు..!

కరీంనగర్, మనసాక్షి :

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, ఉన్నత విద్యా విస్తరణకు దోహదపడే కీలక నిర్ణయాన్ని తెలంగాణ కాబినెట్ 36 ఎకరాల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకుకు కేటాయించింది. ఈ భూమిలో నూతన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కళాశాల ద్వారా హుస్నాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది.

సాంకేతిక విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. స్థానిక యువతకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే కాకుండా, నూతన విద్యా కేంద్రంగా విద్యారంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని, అది ప్రాంతీయ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకారం అందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకి, మంత్రివర్గ సభ్యులందరికీ ఉపకులపతి ఉమేశ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

MOST RAED : 

 

మరిన్ని వార్తలు