District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. రూప్ టాప్ సోలార్ సిస్టం పనుల పూర్తి కి టార్గెట్..!
నల్గొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న "రూఫ్ టాప్ సోలార్ సిస్టం" ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. రూప్ టాప్ సోలార్ సిస్టం పనుల పూర్తి కి టార్గెట్..!
నల్లగొండ, కనగల్, మన సాక్షి:
నల్గొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.
బుధవారం అయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, కనగల్ గ్రామంలో టి ఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” పనులను పరిశీలించారు. కనగల్ మండలంలో, కనగల్ గ్రామంలో 292 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు ఉండగా, వీరికి రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు పైలట్ పద్ధతిన ఎంపిక చేయడం జరిగింది.
ALSO READ : PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!
అంతేకాక జిల్లాలోని అనుముల మండలం అనుముల, దేవరకొండ మండలం ముదిగొండ గ్రామాలలో సైతం పైలెట్ పద్ధతిన “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలలో ఈ పథకం అమలు చేయనుండగా, నల్గొండ జిల్లాలో మూడు గ్రామాలు ఇందుకు ఎంపిక కాబడ్డాయి. ఈ మూడు గ్రామాలలోని గృహ జ్యోతి లబ్ధిదారుల ఇళ్లపై రెండు కిలోవాట్ల “ రూప్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేస్తారు.
ముందుగా ఎంపిక చేసిన లబ్ధిదారుల గృహాలపై “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలతను అధికారులు సర్వే నిర్వహించి అనంతరం “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేయనున్నారు. రెండు ,మూడు రోజుల్లో పైన పేర్కొన్న మూడు గ్రామాలలో సర్వే పూర్తయిన వెంటనే” రూప్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండగా, కనగల్ గ్రామంలో ఇదివరకే 77 ఇళ్లపై “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసే పనులు మొదలయ్యాయి.
రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు వల్ల గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ ద్వారా విద్యుత్తు అందుతుంది. దీంతో వారు 200 లోపు యూనిట్ల విద్యుత్తును వినియోగించుకుని తక్కిన విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేయడం జరుగుతుంది. రెండు కిలోవాట్ల “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు ద్వారా సుమారు 240 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వానికి ,రెండు వైపులా మేలు కలిగే ఈ పథకం పైలెట్ పద్ధతిన విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది .
మొదటి విడతన పైలెట్ పద్ధతిని చేపట్టిన” రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్” పనులను నల్గొండ జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసే విషయమై జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా కనగల్, హాలియా మండలాలలో బుధవారం తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాలలోని గృహ జ్యోతి లబ్ధిదారుల గృహాలపై “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కనగల్ గ్రామంలో ఇప్పటివరకు 77 ఇళ్లపై పై” రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, తక్కిన ఇళ్లపై కూడా సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలించి నిర్దేశించిన సమయంలో సోలార్ సిస్టం యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారు నల్లబోతు వెంకటమ్మతో మాట్లాడుతూ ఇంతవరకు ఎంత ఖర్చు అయిందని ? ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారని? బిల్లులు వస్తున్నాయా? అని అడిగారు. మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులన్ని త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే బిల్లులు సైతం చెల్లిస్తున్నామని, ఎలాంటి అకౌంట్ సమస్యలు లేవని, శాంక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాతే ఫోటో క్యాప్చర్ చేసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు.
ALSO READ : Hyderabad : హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్.. 16 రాష్ట్రాలలో 104 మంది అరెస్టు..!
మండల వ్యవసాయ అధికారి తో మాట్లాడుతూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కనగల్ మండలంలో ఇప్పటివరకు కేవలం 47% మాత్రమే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందని, అందువలన రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, మండలంలో నూటికి నూరు శాతం రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
రైతులు ఎవరైనా ఇతర ప్రాంతాలలో ఉన్నట్లయితే వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాల్సిందిగా సర్పంచ్ మురళీధర్ తో కోరారు. జిల్లా కలెక్టర్ వెంట రెడ్ కో జిల్లా మేనేజర్ సంతోష్,ట్రాన్స్కో ఏఈ ఆర్ ఎన్. జె. కుమార్, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, సెక్రటరీ వీరబాబు, తదితరులు ఉన్నారు.
MOST READ :
- Nalgonda : పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 (144 సెక్షన్) అమలు.. పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!
- Rythu Bharosa : రైతు భరోసా ఇచ్చేది ఎప్పుడు.. కీలక అప్డేట్..!
- Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!
- TG : ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కొత్త పథకాలు.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇవీ..!










