Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

TG : తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!

తెలంగాణలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

TG : తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. భూ అంతర్భాగంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఈ ప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది.

కేవలం మంచిర్యాల జిల్లాలోనే కాకుండా ఈ ప్రభావం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా కనిపించింది. అక్కడ నివసించే ప్రజలు కూడా భూమి కల్పించినట్లుగా గుర్తించారు. ఇళ్లలోని సామాన్లు కింద పడటం, కిటికీలు శబ్దం చేయటం జరిగిందని ప్రజలు పరుగులు తీశారు. భూకంప ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. దాంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు