Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఎస్వీ మోడల్ స్కూల్లో ఘనంగా సూపరిపాలన దినోత్సవం..!

మిర్యాలగూడ వాసవి నగర్‌లోని ఎస్‌.వి. మోడల్ హై స్కూల్‌లో గురువారం స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపట్టి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ విభాగాల అధికారుల పాత్రలను సమర్థవంతంగా పోషించారు.

Miryalaguda : ఎస్వీ మోడల్ స్కూల్లో ఘనంగా సూపరిపాలన దినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ వాసవి నగర్‌లోని ఎస్‌.వి. మోడల్ హై స్కూల్‌లో గురువారం స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపట్టి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ విభాగాల అధికారుల పాత్రలను సమర్థవంతంగా పోషించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వం, బాధ్యతాభావం, సమన్వయ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యమని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాం సుందర్ మాట్లాడుతూ స్వయంపాలన దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత భావనను పెంపొందించే మంచి వేదిక అని అన్నారు. డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి ప్రతిభను చాటారు. ప్రెసిడెంట్‌గా ఓరుగంటి పార్థు శశాంక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్‌గా రిత్విక్ గుప్తా, ప్రైమ్ మినిస్టర్లుగా మణికంఠ, నజీర్ అహ్మద్, ఫైనాన్స్ మినిస్టర్లుగా శృతి, సాయి చరణ్, చీఫ్ మినిస్టర్‌గా వరుణ్, డిప్యూటీ సీఎం‌గా సమీర్, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా నిహారిక, హోమ్ మినిస్టర్‌గా సుమయ్య, ఐటి మినిస్టర్‌గా ఆర్యన్ బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే ఆర్జేడీ గా నీక్షిత, ఐ ఎ ఎస్ గా కీర్తన, డిప్యూటీ కలెక్టర్‌లుగా వరుణ్ తేజ్, మోక్షిత్ రెడ్డి, కలెక్టర్‌గా కీర్తి, జాయింట్ కలెక్టర్‌గా అనన్య, ఎంపీగా లీలావతి, ఎమ్మెల్యేగా రక్షిత, స్పోర్ట్స్ మినిస్టర్‌గా మురారి, డీఈవోగా జై శ్రీ లక్ష్మి, అక్షిత్, ఎంఈఓగా విశ్వజ, డాక్టర్‌గా హర్షిని పాల్గొన్నారు. పాఠశాల నిర్వహణ పాత్రల్లో కరస్పాండెంట్‌గా వినయ్ కుమార్, ప్రిన్సిపాల్‌గా స్వాతి, వైస్ ప్రిన్సిపాల్స్‌గా సాత్విక్, ఇషాంత్ రెడ్డి, నికిత, అనాజ్, యశ్వంత్, జయలక్ష్మి, అకౌంటెంట్‌గా భార్గవి బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు