Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

హరీష్‌రావును కలిసిన గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు..!

మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావును గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

హరీష్‌రావును కలిసిన గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు..!

గుర్రంపోడు, మన సాక్షి:

మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావును గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన ఈ భేటీలో గుర్రంపోడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావుతో పాటు ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహ రావు, నాగులవంచ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తిరుపతిరావు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.దీనిపై హరీష్‌రావు స్పందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

MOST READ : 

మరిన్ని వార్తలు