Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
Hyderabad : హైదరాబాదులోని బాచుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం..!
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారి వెంట దారి పొడవున ఉన్న పలు ఫర్నిచర్ దుకాణాలు దగ్దమయ్యాయి.

Hyderabad : హైదరాబాదులోని బాచుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం..!
హైదరాబాద్, మనసాక్షి :
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారి వెంట దారి పొడవున ఉన్న పలు ఫర్నిచర్ దుకాణాలు దగ్దమయ్యాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. బాచుపల్లి – మియాపూర్ ప్రధాన రహదారిపై కేజిఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు ఉన్నాయి. ఒక్కో షాపులో లక్ష రూపాయలకు పైగా విలువైన సామాగ్రి ఉంది.
ఈ ప్రమాదం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. విద్యుత్ ఘాతం కారణంగా ఒక దుకాణం నుంచి చెలరేగిన మంటలు అన్ని దుకాణాలకు వ్యాపించాయి. ఈ దుకాణదారులంతా అందులోనే నివాసం ఉంటున్నారు. దాంతో నిల్వ ఉన్న గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలడంతో మంటలు మరింతగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పుతున్నాయి.









