శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర పద్మావతి అలివేలు మంగ బ్రహ్మోత్సవాలు..!
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల ( మాల్) వీటి నగర్ గ్రామ పంచాయతీ పరిధి లో గల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై గత 200 సంవత్సరాల క్రితం పూర్వీకులు నెలకొల్పబడిన శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి అలివేలు మంగ స్వామి బ్రహ్మోత్సవం కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి.

శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర పద్మావతి అలివేలు మంగ బ్రహ్మోత్సవాలు..!
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల ( మాల్) వీటి నగర్ గ్రామ పంచాయతీ పరిధి లో గల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై గత 200 సంవత్సరాల క్రితం పూర్వీకులు నెలకొల్పబడిన శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి అలివేలు మంగ స్వామి బ్రహ్మోత్సవం కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అనగా 5 వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల కమిటీ నిర్వాహకులు గుట్టపై సర్వం సిద్ధం చేశారు. గురువారం గుట్ట పైకి శివాలయం నుండి ఉత్సవ విగ్రహమూర్తుల ప్రతిమలను డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి తరలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు జిల్లాల కూడలిలో నెలకొని ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దాతలు సహకారంతో దిన దిన అభివృద్ధి చెందుతుంది.
ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపీతంగా కన్నుల పండుగ గా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు గుట్టపై సర్వం సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు ప్రతి ఏట ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు విచ్చేయనున్నారని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు విచ్చేయుచున్న భక్తులకు గుట్ట పై సకల సౌకర్యాలు సమకూరుస్తున్నామన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను విజయాంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేద పండితులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.