Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంనల్గొండ

Nalgonda : నేరస్తునికి జైలు శిక్ష, జరిమానా..!

రోడ్డు ప్రమాదం చేసి ఒక వ్యక్తి మృతికి కారణమైన నేరస్తునికి జైలుశిక్ష, జరిమాన ను నకిరేకల్ మెజిస్ట్రేట్ విధించారని నల్గొండ జిల్లా కేతేపల్లి ఎస్సై యు సతీష్ తెలిపారు.

Nalgonda : నేరస్తునికి జైలు శిక్ష, జరిమానా..!

కేతేపల్లి, మనసాక్షి:

రోడ్డు ప్రమాదం చేసి ఒక వ్యక్తి మృతికి కారణమైన నేరస్తునికి జైలుశిక్ష, జరిమాన ను నకిరేకల్ మెజిస్ట్రేట్ విధించారని నల్గొండ జిల్లా కేతేపల్లి ఎస్సై యు సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 24. 11. 2015 న కేతేపల్లి మండలంలోని చీకటి గూడెం గ్రామ సమీపంలో గల హెచ్. పి. పెట్రోల్ బంకులో వాచ్ మెన్ గా గా పనిచేయుచున్న కల్వలపాలెం గ్రామం వేములపల్లి మండలానికి చెందిన గడ్డమీద మల్లయ్య చీకటి గూడెం గ్రామం నుంచి తిరిగి వస్తూ జాతీయ రహదారి 65 పై రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టటంతో మల్లయ్య తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మరణించాడు.

ఇన్నోవా కార్ ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపి ఒకరి మృతికి కారణమైన కృష్ణాజిల్లా ఉంగటూరు మండలానికి చెందిన పామర్తి జోజి కి, నకిరేకల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరు నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానాను విధించారని ఆయన వివరించారు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ఆయన వివరించారు. ఈ కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన కోర్టు కానిస్టేబుల్ జి. సురేష్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారని ఆయన తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు