Penpahad : అనుమానాస్పదంగా మహిళ మృతి..!
పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మచ్చ మట్టమ్మ (50). అనుమానస్పదంగా మృతి చెందినది. పోలీసులు, మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన మచ్చ మట్టమ్మ (50) బుధవారం రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. వారి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు.

Penpahad : అనుమానాస్పదంగా మహిళ మృతి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మచ్చ మట్టమ్మ (50). అనుమానస్పదంగా మృతి చెందినది. పోలీసులు, మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన మచ్చ మట్టమ్మ (50) బుధవారం రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. వారి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు.
మృతురాలు కుమారుడు మచ్చ సతీష్ కు కొంతమంది గ్రామస్తులు మీ తల్లి మట్టమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో పెన్ పహాడ్ గ్రామానికి చెందిన మామిడి రాములు 108 అంబులెన్స్ పై ఏరియా హాస్పిటల్ తరలించాడని చెప్పినారు. దీంతో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చూడగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని మామిడి రాములు మృతురాలు కుటుంబ సభ్యులతో తెలిపారు.
తమ తల్లి బుధవారం రాత్రి రాములు ఇంట్లోనే ఉందని ఆమె మెడ చుట్టూ వాపుగా ఉందని. మామిడి రాములు హత్య చేసి ఉంటాడని. మృతురాలు కుమారుడు మచ్చ సతీష్ పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం చేస్తున్నట్లు ఎస్సై గోపికృష్ణ తెలిపారు. మృతురాలకు.. ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
MOST READ :