Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసంగారెడ్డి జిల్లా

సెర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్ పి వి వాక్సిన్.. ఎమ్మెల్యే మాణిక్ రావు..!

సెర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్ పి వి వ్యాక్సిన్ పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.

సెర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్ పి వి వాక్సిన్.. ఎమ్మెల్యే మాణిక్ రావు..!

జహీరాబాద్, మనసాక్షి :

సెర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్ పి వి వ్యాక్సిన్ పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల వయసున్న ఆడ పిల్లలందరూ హెచ్ పి వి వాక్సిన్ తీసుకోవాలన్నారు హెచ్పివి వ్యాక్సిన్ వలన సెర్వైకల్ క్యాన్సర్ ను నివారించడానికి, బాలికల భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందన్నారు.అనంతరం *అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా డాక్టర్ లను, నర్సులను ,సిబ్బందిని శాలువాలతో సత్కరించి, వారు ప్రజలకు అందిస్తున సేవలను అభినందించారు

ఈ కార్యక్రమంలోబి ఆర్ స్ సీనియర్ నాయకులు నామ రవికిరణ్, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లు గౌస్ గోరి, జహీద్ అలీ, మహిపాల్ యాదవ్ ,జాకీర్, పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు విశ్వేశ్వర్, శివకుమార్ స్వామి ,దశరథ్, హశం, అలీం తదితరులు పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు