Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : నిధులు లేక నిలిచిన రోడ్డు పనులు..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని నేషనల్ హైవే 365 నెంబర్ జాతీయ రహదారి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్డులోని మిల్లు వరకు ఉన్న సింగిల్ బిటి రోడ్డు గుంతల మయంగా మారి ప్రజలకు అసౌకర్యంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనదారులు పాదాచారులు గుంతలలో గుద్దుకొని చాలా మందికి బండి పై నుండి పడి గాయాలు కావడం ఈ రోడ్డు చాలా లోతైన గుంతలతో ఉండడంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నామన్నారు.

Suryapet : నిధులు లేక నిలిచిన రోడ్డు పనులు..!

తుంగతుర్తి, మాన సాక్షి :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని నేషనల్ హైవే 365 నెంబర్ జాతీయ రహదారి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్డులోని మిల్లు వరకు ఉన్న సింగిల్ బిటి రోడ్డు గుంతల మయంగా మారి ప్రజలకు అసౌకర్యంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనదారులు పాదాచారులు గుంతలలో గుద్దుకొని చాలా మందికి బండి పై నుండి పడి గాయాలు కావడం ఈ రోడ్డు చాలా లోతైన గుంతలతో ఉండడంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నామన్నారు.

గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మందుల సామెల్.రోడ్డు విస్తరణ పనులకు మరల 13 మార్చి 2024న శంకుస్థాపన చేశారు.కాగా రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి దాదాపు రెండేళ్లు అవుతున్న ఇప్పటివరకు పూర్తి కాలేదు.

మొత్తం 9.6 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ కోసం 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించడంతో పాటు అక్కడక్కడ కల్వర్టుల నిర్మాణం కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడం ఒక్క రూపాయి బిల్లు కూడా రాకపోవడంతో రోడ్డు పనులు వేశారు.

రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రాకపోకలకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నాయి కావున తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేశారు చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తక్షణమే నిధులు విడుదల చేయాలి :

జిల్లా సిపిఎం నాయకులు బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు వివరణ పనులకు శంకుస్థాపన చేసి రెండు నెలలు అవుతున్న నేటికీ పనులు పూర్తి కావడం విచారకరం ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు.నిధులు విడుదల కాగానే పూర్తి చేయిస్తాం.

ఆర్ అండ్ బి ఏ ఈ యుగంధర్ వివరణ. 365 నెంబర్ జాతీయ రహదారి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్డు లోకి మెళ్లు వరకు రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది.  కాంట్రాక్టర్ కొన్ని పనులు చేశారు కానీ నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి నిధులు విడుదల కాగానే పూర్తి చేయిస్తాం. అని అధికారులు తెలిపారు.

By : Subhash, Thungathurthy 

మరిన్ని వార్తలు