Suryapet : పవర్ లిఫ్టింగ్ లో 10 మెడల్స్ సాధించిన సూర్యాపేట జిల్లా యువకుడు..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి గ్రామానికి చెందిన శివ శంకర్ రాష్ట్ర స్థాయిలో 4 మెడల్స్ జిల్లా స్థాయిలో 6 మెడల్స్ ని సాధించాడు.

Suryapet : పవర్ లిఫ్టింగ్ లో 10 మెడల్స్ సాధించిన సూర్యాపేట జిల్లా యువకుడు..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి గ్రామానికి చెందిన శివ శంకర్ రాష్ట్ర స్థాయిలో 4 మెడల్స్ జిల్లా స్థాయిలో 6 మెడల్స్ ని సాధించాడు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన బుడగబోయిన వెంకటనారాయణ శాంత లకి మొదటి సంతానం బూడిగెబోయిన శివశంకర్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 22 సంవత్సరాల వయసు కలిగిన బుడగబోయిన శివ శంకర్ తాను చిన్ననాటి నుండే పవర్ లిఫ్టింగ్ పై శ్రద్ద ఉండటంతో కోచ్ కుమార్ సహాయంతో పవర్ లిఫ్టింగ్ లో పట్టు సాధించాడు.
అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో 4 మెడల్స్ జిల్లా స్థాయిలో 6 మెడల్స్ ని ఇటివల జరిగిన సీఎం క్యాంపు లో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటివల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిప్టింగ్ కాంఫిటిషన్ లో కోచ్ కుమార్ సహయసహకారాలతో పవర్ లిఫ్టింగ్ లో పాల్గొని రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి అతి చిన్న వయసులో మెడల్స్ సాధించి గరిడేపల్లికి పేరుప్రఖ్యాతులు గావించినందుకు గరిడేపల్లి మండల హెడ్ క్వార్టర్ లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్య నేతలు అభినంధించారు. వారి బంధువులు స్నేహితులు ఆనంధాన్ని వ్యక్తం చేశారు.
By : VeeraSwami, Garidepally









