Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

BREAKING : నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

BREAKING : నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. గుత్ప గ్రామం సమీపంలో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న పెద్ద బైరి నారాయణ (31), గుత్ప గ్రామానికి చెందిన వ్యక్తులు ఇద్దరు బైరి నారాయణ ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో యువకుడు క్యాసెల్ ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

మృతుడు నారాయణ (ఫైల్ ఫోటో)

విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ దశరథ్, ఉపసర్పంచ్ చిన్న రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి, గాయపడిన ప్రవీణ్‌ను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు నారాయణకు తల్లి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు