క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. రాత్రి వేళ ఆటోలో తిరుగుతూ సెర్చ్..!

దొంగతనం కేసులో 4 గురు నిందితుల అరెస్టు చేసి వారి నుండి  రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. కేసు కు సంబందించిన అరెస్టు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

Suryapet : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. రాత్రి వేళ ఆటోలో తిరుగుతూ సెర్చ్..!

సూర్యాపేట, మనసాక్షి

దొంగతనం కేసులో 4 గురు నిందితుల అరెస్టు చేసి వారి నుండి  రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. కేసు కు సంబందించిన అరెస్టు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులు కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ ఒక ముఠాగా ఏర్పడి ఆటోలను దొంగలించి దొంగరించిన ఆటోలో ప్రయాణం చేస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వృద్ధ మహిళ ను బెదిరించి ఆభరణాలు దొంగలించడం జరుగుతుందని చెప్పారు., దొంగలించిన ఆటోలోనే తిరుగుతూ రాత్రివేళ తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనం చేయడం వీరి పద్ధతి అని తెలిపారు.

ALSO READ హృదయ విధారక ఘటన.. తండ్రి మృతి.. పరీక్షకు హాజరైన కుమారుడు..!

సూర్యాపేట కోదాడ ప్రాంతాలకు చెందిన వీరు ముఠాగా ఏర్పడి ఈనెల 6 తేదీన ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని కోటి నాయక్ తండ శివారులో ఒక వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరము తీసుకువెళ్లి వృద్ధురాలని చంపుతామని బెదిరించి ఆమె నోరు మూసి ఆమె మెడలో ఉన్న వెండి గొలుసు దొంగలించుకొని వెళ్ళరని చెప్పారు.దీనిపై సంబంధిత వారు 10వ తారీఖున ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా రాబరీ దొంగతనం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా సిసిఎస్ పోలీసులు ఆత్మకూరు పోలీసులు నేరానికి పాల్పడ్డ వారిని టెక్నాలజీ ద్వారా గుర్తించి కదలికలను గమనిస్తూ శనివారం ఉదయం ఆత్మకూరు మండల పరిధిలోని ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు అనుమానిత వ్యక్తులు ఒక టీఎస్ 29 టీ 1190 ఆటోలో నిమ్మికల్ వైపు వెళుతున్నారు. వీరిని ఆపి తనిఖీ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు..

కోదాడ రాజీవ్ నగర్ కు చెందిన కంచుకొమ్ముల సంతోష్ ఏ1, కంచుకొమ్ముల గణేష్ ఏ2, కంచుకొమ్ముల సాయికిరణ్ ఏ4, సూర్యాపేటకు చెందిన షేక్ నశ్రీన్ ఏ3 గా గుర్తించడం జరిగింది. వీరిని విచారించగా గతములో మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడుగురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ల పరిధిలో బంగారము ఆభరణములు, వెండి అభరణములు, వెండి వస్తువులు, ఆటోలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ దొంగతనము చేశామని నేరం అంగీకరించరని తెలిపారు.

ALSO READ : Bandi Sanjay : బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి..!

వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి 3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, 5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి మరియు 4 లక్షల విలువైన 3 ఆటొలు, 50 విలువైన ట్యాబ్, ల్యాప్ టాప్, 1 బైకు, 1 టీవి, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడము జరిగిందన్నారు.

ఈ కేసును చెదించడంలో బాగా పనిచేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, టెక్నికల్ టీం అర్ఎస్ఐ రాజశేఖర్ సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఆత్మకూరు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, హరికృష్ణ, అర్ఎస్ఐ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు