viralBreaking Newsజాతీయం

Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు.. (వీడియో)

ఓ కూతురు తన తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకువెళ్ళింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని తండ్రిని ఓ కూతురు గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లింది.

Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు.. (వీడియో)

మన సాక్షి. వెబ్ డెస్క్:

ఓ కూతురు తన తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకువెళ్ళింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని తండ్రిని ఓ కూతురు గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లింది. కాగా కొరియర్ ఆఫీసులో బస్తా లోపల ఏదో కదులుతుండడాన్ని గమనించి అనుమానంతో మూట విప్పి సిబ్బంది చూశారు.

దాంతో మూటలో నుంచి ఓ వ్యక్తి బయటికి రాగా ఇదేమిటని ఆ కుటుంబాన్ని నిలదీశారు. టికెట్లు దొరకకపోతే ఇంతకంటే ఏం చేస్తాం..? ఇతడిని పార్సిల్ చేయాల్సిందే అంటూ కుటుంబ సభ్యులు వారించారు. సమాచారం తెలుసుకుని అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చివరికి ఇదంతా రీల్ కోసం ఇలా చేశామని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

మరిన్ని

మరిన్ని వార్తలు