Nalgonda : మతసామరస్యానికి ప్రతీక రంజాన్.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మత కలహాలు లేకుండా సోదరభావంతో, ఐక్యతతో రంజాన్ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Nalgonda : మతసామరస్యానికి ప్రతీక రంజాన్.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి
రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మత కలహాలు లేకుండా సోదరభావంతో, ఐక్యతతో రంజాన్ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం ఆయన నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతోకలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత 30 రోజుల పాటు ముస్లింలు కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ,క్రమశిక్షణ,దాతృత్వం, ధార్మిక చింతన కలయిక పవిత్ర రంజాన్ పర్వదినం అని అన్నారు. అల్లా వారందరి జీవితాలలో వెలుగులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు. అల్లా ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ముస్లిం సోదరులంతా రంజాన్ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని తెలిపారు.నల్గొండ పట్టణంలోగత 30 సంవత్సరాలుగా హిందు , ముస్లింలు ఎలాంటి మత కలహాలు లేకుండా పండుగలు శాంతియుతంగా జరుపుకుంటున్నారని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని,
ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల ముస్లింలు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి ,ఏ ఎస్ పి రమేష్. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, తహసిల్దార్ పరుశురాములు, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి ,స్థానిక కార్పొరేటర్ మామిడి కార్తీక్, సుభాష్, నవీన్ ,అధికారులు, మైనార్టీ నాయకులు ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.










