రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రు .5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రభుత్వం అందజేయపడుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రు .5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… బాలు నాయక్.
చింతపల్లి, మనసాక్షి. :
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రభుత్వం అందజేయపడుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 251 మందికి గాను 92,61000/- రూపాయల విలువ గల చెక్కులను స్వయంగా లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కొండమల్లేపల్లి మండలం మొత్తం -11 చెక్కులు గాను 1101276/- రూపాయలు.
చింతపల్లి మండలం మొత్తం – 25చెక్కులకు గాను 2502900/- రూపాయలు.చందంపేట మండలం మొత్తం 43 చెక్కులకు గాను 4304988/- రూపాయలు. డిండి మండలం మొత్తం – 20 చెక్కులకు గాను 2002320 /- రూపాయలు. మొత్తం 99 చెక్కులకు గాను 9911484/- రూపాయల విలువ గల చెక్కులను అబ్దిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ముఖ్య మంత్రి సహాయనిధి కింద మంజూరు అయిన 3526 చెక్కులను గాను దాదాపు 16కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంపిణి చేయడం జరిగిందన్నారు. అలాగే 293మందికి ఎల్ ఓ సి ద్వారా దాదాపు 9కోట్ల రూపాయలతో మెరుగైన వైద్యం అందించాం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం సహాయనిధి ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు.
పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 2వ తేదీ 2026 నుంచి రాష్ట్రంలో సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుందని బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










