Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు  మంత్రి వివేక్ శంకుస్థాపన

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అభివృద్ధికి రూ.2 కోట్ల 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంబిచారు.

మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు  మంత్రి వివేక్ శంకుస్థాపన

మందమర్రి, మానసాక్షి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అభివృద్ధికి రూ.2 కోట్ల 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంబిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలలో పర్యావరణ పరిరక్షణ కై ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే ప్రదేశాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధితో స్థానిక ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో సేదతీరే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగాఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు