Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా
పోస్ట్ ఆఫీస్ బదిలీ చేయొద్దని పోస్టల్ ఎస్పీకి సర్పంచులు వినతి
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చదురుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గల పోస్ట్ ఆఫీస్ ను బదిలీ చేయొద్దని సోమవారం వనపర్తి సబ్ డివిజనల్ పోస్ట్ ఇనిస్పెక్టర్ గోపీనాథ్ కు చెదురుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని సర్పంచులు వినతి పత్రం అందజేశారు.

పోస్ట్ ఆఫీస్ బదిలీ చేయొద్దని పోస్టల్ ఎస్పీకి సర్పంచులు వినతి
వెల్దండ, మన సాక్షి :
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చదురుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గల పోస్ట్ ఆఫీస్ ను బదిలీ చేయొద్దని సోమవారం వనపర్తి సబ్ డివిజనల్ పోస్ట్ ఇనిస్పెక్టర్ గోపీనాథ్ కు చెదురుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని సర్పంచులు వినతి పత్రం అందజేశారు. చెదురుపల్లి గ్రామ సర్పంచ్ ధన్సింగ్ నాయక్, పోచమ్మ గడ్డ తండా సర్పంచ్ మహిపాల్ నాయక్ ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
గ్రామంలో 4 వేలకు పైగా జనాభా ఉన్నారని, మూడు గ్రామాలకు, 12 తండాలకు పోస్ట్ ఆఫీస్ సేవలు గత 50 సంవత్సరాలుగా అందుతున్నాయని, పోస్ట్ ఆఫీస్ బదిలీ చేయకూడదనే అంశాన్ని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు పోలే అశోక్, తిరుపతయ్య గౌడ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు చదవండి
- Rythu Bharosa : రైతు భరోసా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఖాతాలలో జమ ఎప్పుడంటే..!
- రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రు .5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
- TS News : బిల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. భవన నిర్మాణం రూల్స్ లో కీలక మార్పులు..!
- LPG GAS : గ్యాస్ కొరత నేపథ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..!









