Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Gurukula : గురుకుల పరీక్ష లో వెంపటి విద్యార్థుల ప్రతిభ..!

తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టి జి సి ఈ టి..2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంపటి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది.

Gurukula : గురుకుల పరీక్ష లో వెంపటి విద్యార్థుల ప్రతిభ..!

తుంగతుర్తి, మన సాక్షి :

తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టి జి సి ఈ టి..2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంపటి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది.

ఈ పరీక్షకు పాఠశాల నుండి మొత్తం 35 మంది విద్యార్థులు హాజరుకాగా,వారిలో 28 మంది విద్యార్థులు అర్హత సాధించి సీటు పొందారు. ఇది పాఠశాల ఉపాధ్యాయులకృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి సాధించిన విజయం. ఈసందర్భంగా పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను అభినందించడం జరిగింది.

ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామ నరసమ్మ మాట్లాడుతూ మాపాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయము ఎంతో గర్వకారణమని గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఉన్నత లక్ష్యాలను చేరగలరని మరోసారి నిరూపించారని ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, నిరంతర సాధనతో ఈ ఫలితాలను సాధించగలిగారని తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఆసక్తి చూపడం వల్లే ఈ విజయo సాధ్యమైందన్నారు.

భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాల తరపున అన్ని విధాల కృషి చేస్తామనిఅన్నారుఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పునాది స్థాయి నుంచే సరైన మార్గదర్శనం,సాధన,పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందానికికృతజ్ఞతలు తెలిపారుగ్రామ పెద్దలు ఈ విజయాన్ని ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ విజయంతో వెంపటి పాఠశాల జిల్లా స్థాయిలో ఒక ఆదర్శ పాఠశాలగా నిలిచిందని అందరూ అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయబృందం భీవనపల్లి శ్రీనివాస్, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మరబోయిననవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల,శీలోజు రమాదేవిలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు