Breaking Newsక్రైంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి..! 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూర్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో రెండు ఆవు దూడలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

వీధి కుక్కల దాడిలో ఆవు దూడలు మృతి..! 

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూర్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో రెండు ఆవు దూడలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ళ అల్లాజి శనివారం సాయంత్రం పాలు పిండుకొని ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం పాలు పిండడం కోసం ఆవుల వద్దకు చేరుకొనగా రెండు ఆవు దూడలు మృతి చెంది ఉన్నాయని వాపోయారు. శనివారం రాత్రి వీధి కుక్కలు జరిపిన దాడిలో ఆవు దూడలు మృతి చెందినట్లు గుర్తించారు.

ఆవు దూడలు మృతి చెందడంతో ఉపాధిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో వీధి కుక్కలు పెరిగిపోయాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ గున్నెళ్ళ శ్రీనివాస్ ను చరవాణి ద్వారా సంప్రదించగా .. త్వరలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు