Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

పోస్టల్ డివిజన్ ఎస్పీపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామం లోని పోస్టాఫీసును గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా తరలించిన వనపర్తి డివిజన్ పోస్టల్ ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో చెదురుపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

పోస్టల్ డివిజన్ ఎస్పీపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామం లోని పోస్టాఫీసును గ్రామస్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా తరలించిన వనపర్తి డివిజన్ పోస్టల్ ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో చెదురుపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తక్కువగా ఉన్నాయని, పోస్ట్ ఖాతాలను పెంచుకునే పనిలో నిమగ్నమై ఉన్న గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా చారకొండ మండలంలోని కమలాపూర్ తండాకు తరలించడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 4వేల జనాభా ఉన్న గ్రామానికి చెందిన పోస్ట్ ఆఫీస్ ను వెయ్యి జనాభా ఉన్న కమలాపూర్ కు తరలించడం ఎంతవరకు సమంజసం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్ట్ ఆఫీస్ ను తిరిగి చెదురుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దన్సింగ్ నాయక్, నాయకులు పోలే అశోక్, కమ్మ గోని తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు