Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : కొత్తగూడెం చాకలి వాగు ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ట్రాక్టర్ యజమానుల బైండోవర్ కు ఆదేశాలు..! 

సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ శివారు చాకలి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతుందని విశ్వాసనియమైన సమాచారం రావడంతో బుధవారం ఆర్డిఓ వేణు మాధవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Suryapet : కొత్తగూడెం చాకలి వాగు ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ట్రాక్టర్ యజమానుల బైండోవర్ కు ఆదేశాలు..! 

మన సాక్షి , మోతే :

సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ శివారు చాకలి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతుందని విశ్వాసనియమైన సమాచారం రావడంతో బుధవారం ఆర్డిఓ వేణు మాధవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాగు ఇసుక తవ్వకాలలో  కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది ట్రాక్టర్ యజమాలను గుర్తించిన వారిని బైండోవర్ చేయాలని స్థానిక తాహసిల్దార్ వెంకన్న ను ఆదేశించారు.

అదే విధంగా వాగులోకి వాహనాలు ప్రవేశించకుండా ఆర్ఐ కరుణాకర్ రెడ్డి జెసిబిల సాయంతో వాగు ఇరువైపుల కందకాలు తవ్వించడం జరిగిందని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో కూడలి, పాలేరు వాగుల నుంచి కాకుండా ఇంకా ఇతర ఎక్కడి వాగులోంచి ఆవాస గ్రామాల నుండి ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా తీసుకుని తరలిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆయన వెంట జి పి వో ప్రవీణ్ లు ఉన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు