Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

District collector : మీరు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారా.. అయితే రండి, జిల్లా కలెక్టర్ పిలుపు..!

పారిశ్రామిక వేత్తలుగా కావాలనుకునే వారికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నూతన పిలుపునిచ్చారు. ఈనెల 11న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్స్ లో తెలంగాణ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ పంచాయత్” ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.

District collector : మీరు పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారా.. అయితే రండి, జిల్లా కలెక్టర్ పిలుపు..!

నల్లగొండ, మన సాక్షి :

పారిశ్రామిక వేత్తలుగా కావాలనుకునే వారికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నూతన పిలుపునిచ్చారు. ఈనెల 11న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్స్ లో తెలంగాణ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ పంచాయత్” ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఇన్నోవేషన్ పంచాయత్ పై రూపొందించిన గోడ పత్రికను సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

నూతన ఆవిష్కరణలు, అంకురాలను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ, సూర్యాపేట అలాగే యాదాద్రి జిల్లాల నుండి ఆవిష్కర్తలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ఆవిష్కర్తలకు, వారికి అవసరమైన తోడ్పాటుకు మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తగ్గించడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన వేదికగా ఇన్నోవేషన్ పంచాయత్ ను రూపొందించారాని, యువత తమ ఆలోచన, ఆవిష్కరణ అలాగే పారిశ్రామిక ప్రయాణం గురించి సందేహాలుంటే ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని వ్యవస్థాపక నిపుణుల నుండి వ్యక్తిగత, మార్గదర్శకత్వం పై సలహాలు పొందేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, తక్షణ మరియు స్పష్టమైన సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారని ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు, నిపుణులతో నేరుగా చర్చించవచ్చని వ్యాపారం లేదా సాంకేతిక సవాళ్లను అక్కడికక్కడే పరిష్కరించడానికి మార్గదర్శకత్వం, ఆలోచన ధ్రువీకరణ, నమూనా అభివృద్ధి, వ్యాపారాన్ని విస్తరించే ప్రక్రియపై సలహాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంక్యుబేషన్ సహాయాన్ని నేరుగా పొందడానికి కనెక్షన్లను సులభతరం చేసి అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు.

అంకురాలకు మద్దతుగా, సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం బలపరుస్తుందని, ఈ జిల్లాల నుండి ఆవిష్కర్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులు, ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎఫ్ఓ రాజశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవోలు రమణారెడ్డి శ్రీదేవి, ఈడియం దుర్గారావు,టి జి ఐ సి కో ఆర్డినేటర్లు అనూష,ఫరీన తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు