Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోరం.. పెళ్లి మొక్కు చెల్లించేందుకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం..!
పెళ్లి మొక్కు చెల్లించేందుకు వెళ్లి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు కు చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. మేళ్లచెరువు గ్రామానికి చెందిన యాదవ కుంటుంబాలు తమ బంధువుల అబ్బాయికి పెళ్లి కుదిరి ఈ నెల 8 న (మంగళవారం)పెళ్లి జరగాల్సి ఉంది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోరం.. పెళ్లి మొక్కు చెల్లించేందుకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం..!
మేళ్లచెరువు, మనసాక్షి :
పెళ్లి మొక్కు చెల్లించేందుకు వెళ్లి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు కు చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. మేళ్లచెరువు గ్రామానికి చెందిన యాదవ కుంటుంబాలు తమ బంధువుల అబ్బాయికి పెళ్లి కుదిరి ఈ నెల 8 న (మంగళవారం)పెళ్లి జరగాల్సి ఉంది.
పెళ్లి మొక్కు చెల్లించేందుకు 20 మంది కుటుంబ సభ్యులు బొలేరో లో 7న(సోమవారం) ఏచర్ల ముత్యాలమ్మ గుడికి వెళ్లి అక్కడ మొక్కు తీర్చుకున్నారు.అక్కడి నుండి అర్ధరాత్రి బయల్దేరి దురాజ్ పల్లి లింగమంతుల గట్టుకు వస్తుండగా వెనుక నుండి వస్తున్న డిసిఎం బొలేరోను బలంగా ఢీకొట్టడంతో బొలేరో ఫల్టీ కొట్టంది.అందులో ఉన్న జనిగె సతీష్(25) స్పాట్ లో మృతి చెందగా,జనిగె నర్సింహారావు(36) తలకు తీవ్రగాయాలు అయ్యాయి.
అతనిని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలిస్తుంగా చనిపోయాడు.మిగిలిన వారికి గాయాలయ్యాయి. నర్సింహారావు మేనల్లుడు శ్రీకాంత్ పెళ్లికి మొక్కు చెల్లించేందుకు వెళ్లి ఇలా రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొన్నది. సతీష్ వ్యవసాయం చేసుకుంటుండగా, నర్సింహారావు మఠంపల్లి లోని ఓ పరిశ్రమకు చెందిన ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు.