Curd : వేసవిలో గడ్డ పెరుగు, తియ్యగా రావాలంటే ఈ చిట్కా పాటించండి..!
వేసవిలో.. భోజనంలో పెరుగు తప్పనిసరిగా వేసుకుంటే మంచిది. ఎండ వేడి నీవల్ల ఇబ్బందులు పడకుండా పెరుగుతో భోజనం చేస్తే చలువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఇష్టమైన ఆహారమే. కానీ ఆ పెరుగు పుల్లగా ఉంటే ఎవరికి నచ్చదు. అందుకే గడ్డ పెరుగు తీయగా ఉంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.

Curd : వేసవిలో గడ్డ పెరుగు, తియ్యగా రావాలంటే ఈ చిట్కా పాటించండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వేసవిలో.. భోజనంలో పెరుగు తప్పనిసరిగా వేసుకుంటే మంచిది. ఎండ వేడి నీవల్ల ఇబ్బందులు పడకుండా పెరుగుతో భోజనం చేస్తే చలువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఇష్టమైన ఆహారమే. కానీ ఆ పెరుగు పుల్లగా ఉంటే ఎవరికి నచ్చదు. అందుకే గడ్డ పెరుగు తీయగా ఉంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలా ఉండాలంటే ఇంట్లోనే గడ్డపెరుగు తీయగా తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం..
పాలను బాగా మరిగించి కొద్దిగా ఎక్కువసేపు ఉంచండి. ఇలా చేస్తే పాలు చిక్కగా అవుతాయి. తరువాత పాలు గోరువెచ్చగా అయ్యాక మాత్రమే పెరుగు ముద్ద వేయాలి. చాలా వేడి లేదా చాలా చల్లగా ఉంటే పెరుగు సరిగా పడదు.
మంచి నాణ్యమైన తియ్యని పెరుగు ముద్ద ఒక స్పూన్ వేయండి. వేసవిలో ఎక్కువ జాము వేయాల్సిన అవసరం లేదు. తక్కువే సరిపోతుంది.
- పెరుగు పెట్టే పాత్ర మట్టి కుండ అయితే ఇంకా గడ్డగా, రుచిగా ఉంటుంది.
- పెరుగు పెట్టిన తర్వాత కదపకుండా 5–6 గంటలు ఉంచండి.
- కొంచెం క్రీమ్ లేదా పాలపై మీగడ కలిపితే పెరుగు మరింత గట్టిగా వస్తుంది.
- తియ్యగా ఉండాలంటే తాజా పాలు వాడండి. పాలు పులిసిపోవడం మొదలైతే పెరుగు పులుపుగా వస్తుంది.
పెరుగు పెట్టేటప్పుడు ఒక పచ్చి మిర్చి వేస్తే కొంతమంది చెప్పినట్టు పెరుగు కొంచెం త్వరగా పడుతుంది, గడ్డగా కూడా రావచ్చు. పచ్చి మిర్చిపై సహజంగా ఉండే బ్యాక్టీరియా ఫర్మెంటేషన్కి సహాయపడుతుంది.
- మిర్చిని కడిగి, తుడిచి వేయాలి.
- మిర్చిని కోయకుండా మొత్తం వేయాలి.
- ఎక్కువసేపు ఉంచితే కొంచెం వాసన లేదా రుచి మారే అవకాశం ఉంటుంది.
- మంచి జాము (పెరుగు ముద్ద) ఉంటే మిర్చి అవసరం లేదు.
- వేసవిలో అయితే సాధారణంగా పెరుగు త్వరగానే పడుతుంది కాబట్టి చిన్న స్పూన్ జాము చాలు.









