Dy CM : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్.. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు పూర్తి చేయాలి..!
ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాదు నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు మంత్రులుఅన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఈ నెల 25 నుంచి నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (మహిళా సంక్షేమ కార్యక్రమాలు) అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.,

Dy CM : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్.. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు పూర్తి చేయాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
జిల్లాలోని వరి ధాన్యం కేంద్రాల వద్ద అకాల వర్షాలతో పంటలు తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు.
ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాదు నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఈ నెల 25 నుంచి నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (మహిళా సంక్షేమ కార్యక్రమాలు) అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులు వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డి ఎం సివిల్ సప్లయ్ సైదులు, డి డబ్ల్యూ రాజేందర్ గౌడ్, డీ ఏ వో జాన్ సుధాకర్, సివిల్ సప్లై అధికారి బాల్ రాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.










