Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : కరెంట్ షాక్ తో మహిళ మృతి..!

కరెంటు షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కలపాడు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

Miryalaguda : కరెంట్ షాక్ తో మహిళ మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కరెంటు షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కలపాడు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన శంకరమ్మ(35) వరి కోత పని నిమిత్తం గ్రామ శివారు లోని వారి వ్యవసాయ భూమికి వెళ్లినది. మధ్యాహ్నం సమయంలో వరి కోత కోస్తున్న క్రమంలో కోత మిషన్ కు కరెంటు స్తంభం నుండి మోటార్ కు వచ్చే సర్వీస్ వైర్ తలిగే అవకాశం ఉంది.

దాంతో శంకరమ్మ కర్రతో సర్వీసు వైరు పైకి లేపగా అది జారీ ఆమె చేతికి తగలడంతో షాక్ తగిలి స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు అంబులెన్స్ కు ఫోన్ చేసి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది. భర్త మాల్సుర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు