Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : హాస్పిటల్లో దారుణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి.. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన..! 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షహ్నబి (60) గుండె నొప్పితో బాధపడుతూ వైద్యం కోసం శుక్రవారం కరీంనగర్ లోని వన్ హాస్పిటల్ లో చేరింది.

Karimnagar : హాస్పిటల్లో దారుణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి.. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన..! 

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షహ్నబి (60) చికిత్స పొందుతు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. మృతిరాలి బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ షహ్నబి గుండె నొప్పితో బాధపడుతూ వైద్యం కోసం శుక్రవారం కరీంనగర్ లోని వన్ హాస్పిటల్ లో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హార్ట్ కి స్టంట్ వేయాలని సూచించారు. దింతో ఆరోగ్య శ్రీ కార్డు మీద హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వైద్యం అందించారు.

షహ్నబి హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పటికీ నుంచి యూరిన్ లో రక్తం వస్తుందని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. వైద్యులు సమస్య ఏమి లేదంటు స్టంట్ వేస్తే సరిపోతుందాంటూ మంగళవారం ఉదయం గుండెకు స్టంట్ వేసినట్లు తెలిపారు. వైద్యం వికటించి స్టంట్ వేసిన కొద్దీ క్షణాల్లోనే షహ్నబి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

షహ్నబి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలుపకుండానే మళ్ళీ 30,000 వేల రూపాయల మందులు తీసుకొని రావాలని వైద్యులు తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డు మీదనే వైద్యం అందిస్తామన్నా హాస్పిటల్ యాజమాన్యం మళ్ళీ డబ్బులు ఎందుకని అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయడంతో ఈ వ్యవహారం బయట పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దింతో కుటుంబ సభ్యులు బంధువులతో కలసి హాస్పిటల్ ఎదుట బైటయించి ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుని హాస్పిటల్ ని సిజ్ చేయాలనీ డిమాడ్ చేస్తున్నారు. మృతురాలికి భర్త జాఫర్ ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు