Nalgonda : చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకం..!

Nalgonda : చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకం..!
నల్లగొండ, మన సాక్షి.
చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి తెలిపారు. ‘8వ పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని చర్లపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తల్లి-శిశు పోషణ, ఆరోగ్య అవగాహనపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మాట, కదలికలు, స్పందన ప్రతి పిల్లలో వయస్సు ప్రకారం గమనిస్తూ వాటిని అభివృద్ధి చేయాలన్నారు. ఆరు నెలలలో చిన్నారులు చిరునవ్వు, తిరగడం, సంవత్సరంలోపు పిల్లలు నడవడానికి ప్రయత్నం చేయడం, రెండు సంవత్సరాలలో వాళ్ళు చిన్న చిన్న మాటలు మాట్లాడటం ఎప్పటికప్పుడు వెంటనే గుర్తించాలన్నారు. ఈ లక్షణాలు లేకపోతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు.
తల్లిదండ్రులకు పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం,ఆటలు ఆడించడాం, ప్రేమగా చూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. టీవీ / మొబైల్ ఎక్కువగా చూపించకుండా ఆటలు వాడేలా అక్షరాలు గుర్తుపట్టేలా వారికి నేర్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సిడిపిఓ తూముల నిర్మల సూపర్వైజర్ పార్వతి అంగన్వాడీ టీచర్లు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










