Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..!
మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామ శివారులోని మూసి వాగులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు రూరల్ పోలీసులు సీజ్ చేశారు.

Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామ శివారులోని మూసి వాగులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు రూరల్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెట్రోలింగ్ సిబ్బంది కాలువ పల్లిలోని జంగాల కాలనీకి వెళ్లేసరికి ఒక ట్రాక్టర్ దాని ట్రాలీ నిండా ఇసుక నింపుకొని కాల్వపల్లి తండా గ్రామం వైపు నుండి మిర్యాలగూడ వైపుకు వస్తుండగా ట్రాక్టర్ యొక్క వివరాలు తెలుసుకున్నారు.
ట్రాక్టర్ నెంబర్ పరిశీలించగా పల్లి కి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్ కళ్లెం ఎల్లయ్య ( ట్రాక్టర్ నెంబరు TS05UB 8772, ట్రాలీ నెంబర్ TS05UB 8773 ) కలదు. అట్టి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ట్రాక్టర్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా కు పాల్పడినట్లయితే, చట్టపరమైన చర్యలు తీసుకొనిబడునని, వాహనాలను జప్తి చేసి కోర్టు నందు డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు.









