Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ గ్రామాలలో సుడిగాలి పర్యటన.. మంచినీటి ఎద్దడి నివారణకు కీలక ఆదేశాలు..!

ఎండలు పెరుగుతున్నందున.. గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. అధికారులను ఆదేశించారు.

District collector : జిల్లా కలెక్టర్ గ్రామాలలో సుడిగాలి పర్యటన.. మంచినీటి ఎద్దడి నివారణకు కీలక ఆదేశాలు..!

కరీంనగర్, మనసాక్షి :

ఎండలు పెరుగుతున్నందున.. గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయితీ పరిధి మల్లన్నపల్లి గ్రామాల్లో ఉన్న మంచినీటి బావులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించి.. నీటి సమస్య తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం మంజూరైన ప్రభుత్వనిధులతో పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వాటి పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత నోడల్ అధికారులకు, ఎంపీఓలకు సూచించారు.

గ్రామాల్లో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్లు, చేతి పంపుల స్థితి, వాటి వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ గనుల శాఖ అధికారులకు సూచించారు. డిపిఓ జగదీశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ శ్రీనివాస్, ఏఈ, డీఈ వినయ్, ఎంపీడీవో వేణుగోపాల చారి, ఎంపీ ఓ రాజగోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

మరిన్ని వార్తలు