Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ కీలక ఆదేశం.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..!
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ కీలక ఆదేశం.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిర్లక్ష్యం ఇస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
ముందుగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. అందరికీ చికిత్స, మందుల పంపిణీ, ఆహారం విషయంపై ఆరా తీశారు. అదేవిధంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమయపాలన కూడా ఆయన తనిఖీ చేశారు.










