TG News : తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కొత్త రూల్స్..!
తెలంగాణలో ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో కొత్త రూల్స్ తీసుకురావాలని నిర్ణయించింది.

TG News : తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కొత్త రూల్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో కొత్త రూల్స్ తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో పింఛన్ల పంపిణీ సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ ఆధారిత గుర్తింపు) విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను ప్రజాభవన్ లో మున్సిపల్ శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు.
ఈ నూతన విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ముఖ గుర్తింపుతో పెన్షన్లు ఇస్తున్నామని, ఇకపై నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనూ కూడా ఫేస్ ఇకగ్నేషన్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ నూతన విధానంతో ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే, చనిపోయిన వారి పేర్లు ఉంటే తొలగించి అర్హులకే పింఛన్లు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శిక్షణ పొందిన అధికారులు వారి వారి జిల్లాలలో సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
MOST READ :
- Nalgonda : బైక్, కారు ఢీకొని ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..!
- Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ SBIలో రూ.2.65 కోట్ల భారీ మోసం.. నలుగురు అరెస్టు..!
- Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!
- Ac : ఏసి కూలర్ అవసరం లేదు.. ఫ్యాన్ కు ఇలా చేస్తే చల్లటి గాలి..!









