Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణసినిమా

మిర్యాలగూడలో సినీ తారలు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ సందడి

మిర్యాలగూడలో… సినీ తారలు

కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ సందడి

మిర్యాలగూడ, మనసాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సినీతారలు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు. మిర్యాలగూడ పట్టణంలో శనివారం “ది చెన్నై షాపింగ్ మాల్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ తారలు హాజరయ్యారు. కాగాహనుమాన్ పేట వద్ద చెన్నై షాపింగ్ మాల్ పరిసర ప్రాంత మంతటా సందడి నెలకొంది.

సినీతారలను చూసేందుకు మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి అభిమానులు వేలాది సంఖ్యలో తరలి వచ్చి వారిని పూలతో స్వాగతం పలికారు. అనంతరం సినీతారలు షాపింగ్ మాల్ లోని కౌంటర్లలవద్ద తిరుగుతూ ఉత్సాహపరిచారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ , చెన్నై షాపింగ్ మాల్ నిర్వాహకులు వెంకట్ రెడ్డి, శశిధర్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ యూసుఫ్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, సలీం, ఉదయ్ భాస్కర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

1. విచిత్రమైన పెళ్లి : తనను తానే పెళ్లి చేసుకోబోతున్న యువతి – latest news

2.సెలవుపై వెళ్లిన చైర్మన్ భార్గవ్, విభేదాలే కారణమా…!

3. చిన్నతనం నుంచి దొంగతనాలే,  అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు

మరిన్ని వార్తలు