Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి

బి ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించిందని రోటి గడ్డ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్ పేర్కొన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని బి ఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రోటి గడ్డ తండాలో ఘనంగా సర్పంచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి

చింతపల్లి, మన సాక్షి :

బి ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించిందని రోటి గడ్డ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్ పేర్కొన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని బి ఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రోటి గడ్డ తండాలో ఘనంగా సర్పంచ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బాపు కేసీఆర్ దేనని, గత పది సంవత్సరాలు వారి పాలనలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచింది ఒక కేసీఆర్ అన్నారు. గత 26 సంవత్సరాలుగా పార్టీ ఎంతో ప్రతి గ్రామంలో ప్రతిష్టంగా ఉందన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నిన గులాబీ జెండాను కదిలించలేరన్నారు.

భవిష్యత్తులో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి పాలననే కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలు గా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కార్యకర్తలంత, కార్యోన్ముఖులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ నాయక్, నేనావత్ శ్రీనివాస్ నాయక్ రవి,లక్ష్మణ్, వినోద్ కుమార్, వెంకటేష్, హరియా రామ్ చరణ్, వంశీ, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు