Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : డిప్యూటీ సి ఎం PRO మధుసుదన్ మృతికి సంతాపం..!
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మరణించడంతో వారి పార్ధివ దేహానికి మంగళవారం మిర్యాలగూడ లో పలువురు నివాళులు అర్పించారు.

Miryalaguda : డిప్యూటీ సి ఎం PRO మధుసుదన్ మృతికి సంతాపం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మరణించడంతో వారి పార్ధివ దేహానికి మంగళవారం మిర్యాలగూడ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, R&B, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం నివాళులు అర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇంచార్జులు, సర్పంచ్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










