Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమశాతం పరిశీలన..!
నారాయణ పేట మండలం సింగారం వరి ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పరిశీలించారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమశాతం పరిశీలన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణ పేట మండలం సింగారం వరి ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పరిశీలించారు. కేంద్రానికి ఇంతవరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం వచ్చిందని, తేమ శాతం సరిగ్గా ఉంటుందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతాన్ని ఆమె చెక్ చేశారు.
సోమవారం సాయంత్రం కురిసిన తేలిక పాటి వర్షానికి కేంద్రంలోని ధ్యానం ఏమైనా తడిసిందా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణకు అవసరమైన తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్ని బ్యాగులు అందుబా టులోఉంచుకోవాలని, ఇంకా అవరమైన వాటి కోసం ఇండెంట్లు పెట్టి తెప్పించుకో వాలని ఆమె సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలింప చేయాలన్నారు. ఒకరిద్దరు రైతులతో మాట్లాడి కేంద్రాని కి ఎప్పుడు వచ్చారు ? ఎన్ని బస్తాల ధ్యానం తీసుకువ చ్చారని వాకబు చేశారు.
కేంద్రంలో కొనుగోలు చేసిన సన్న రకం, దొడ్డు రకం వడ్లను వేరువేరుగా నిల్వ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు , కేంద్రా ల్లో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఆయా మిల్లులకు తరలించే ప్రక్రియ గురించి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను కలెక్టర్ కు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం లో డీసీవో ఎన్. ప్రసాద్ రావు, అసిస్టెంట్ డీసీవో ఆంజనేయులు, సివిల్ సప్లై అధికారి సైదులు, స్థానిక సింగిల్ విండో కార్యాలయ సీ.వో. పళ్ళ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









