SSC : పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు..!
అన్నమయ్య జిల్లా పదవ తరగతి ఫలితాలు గురువారం 11గంటలకు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపాల్ మునిస్వామి నాయక్ తెలిపారు.

SSC : పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా పదవ తరగతి ఫలితాలు గురువారం 11గంటలకు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపాల్ మునిస్వామి నాయక్ తెలిపారు. విద్యార్థిని పి. వైష్ణవి 560/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగాఎం. యశస్విని 550అర్చనశ్రీ 547/600 మార్కులతో సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు 96శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ముని స్వామినాయక్ మాట్లాడుతూ 89మంది విద్యార్థులకు గాను 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాసవ్వని స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి, పాసవ్వాలని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మునిస్వామి నాయక్, నాగరాజు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.









