Miryalaguda : మిర్యాలగూడలో విద్యార్థులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ భరోసా..!
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, వారి ఉన్నత చదువులకు అండగా నిలుస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో విద్యార్థులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ భరోసా..!
రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం పంపిణీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, వారి ఉన్నత చదువులకు అండగా నిలుస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి అత్యధిక మార్కులు సాధించిన 66 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించారు.
విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మొత్తం రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శరత్ కుమార్ డిఎస్పీ రాజశేఖర్ రాజు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
సమాజానికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తుల స్ఫూర్తి నేటి యువతకు అందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా, బిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేసిన ఉచిత పెరుగన్నంను ముఖ్య అతిథులతో కలిసి పంపిణీ చేశారు.
పేద ప్రజల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.












